ENGLISH

:
:

Reservoir Storage Monitoring System
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ప్రధాన జలాశయాల లో నీటి నిలువ మరియు ప్రతి రోజు నీటి మట్టము పర్యవేక్షించుటకు గాను ఈ సాఫ్ట్ వేర్ రూపొందించడ మైనది. నీటి పారుదల మరియు ఆయకట్టు అభివ్రుద్ధి శాఖ(కాడా) రోజు వారి సమాచారము ను సంపాదించి, భద్రపరిచే బాధ్యత కలిగి యున్నది. ఇంటర్ నెట్ ద్వారా ఈ సమాచారము సంబంధిత అధికారులకు మరియు ప్రజలకు అందించుటకు ఈ వెబ్ సైట్ ఉద్దెశింపబడినది. జలాశయ ప్రాంతము నుండి అత్యల్ప సమయంలో సమాచారము పొందుటకు గాను క్షేత్ర స్థాయి సిబ్బంది వారి సెల్ ఫోన్ ద్వారా సంక్షిప్త సందేశము (SMS) పంపడం జరుగుతున్నది. సాధారణ పరిస్థితులలో క్షేత్ర స్థాయి సిబ్బంది రోజు కు ఒక సారి ఈ సందేశం పంపించెదరు. అత్యవసర పరిస్థితులలో ఈ సందేశములు ప్రతి గంట కొక సారి కూడా పొందుటకు వీలు కల్పించబడినది. ప్రధాన అధికారులకు, కార్యదర్శులకు, సంబంధిత శాఖా మంత్రి గారి కార్యాలయాలకు ఫ్యాక్స్ ద్వారా రిపోర్ట్ పంపడం లాంటి నిత్యం జరిగే పనులు కంప్యూటర్ ద్వారా నిర్దేశిత సమయంలో వాటంతట అవే వెళ్లెటట్లుగా చేయటం జరిగింది. ఈ ఫ్యాక్స్ సందేశము కాడా కార్యాలయమునకు ముందుగా అంద చేయబడుతుంది. సంబంధిత అధికారి ఫ్యాక్స్ ను పరిశేలించి మరి ఒక సంక్షిప్త సందేశము పంపి దీనిని ఆమోదించిన పిదప అన్ని కార్యాలయములకు ఫ్యాక్స్ సందేశములు కంప్యూటర్ ద్వారా పంపబడుతాయి. వీటికి అదనంగా ముఖ్యమైన్ అధికారులకు నిర్దేశిత సమయంలో సంక్షిప్త సందేశముల ద్వారా కూడా సమాచారము చేరవేయడం జరుగుతుం .

For Reservoir Detailed Report Click Here





()

IP:34.204.191.31

| ©2007 . Disclaimer | Privacy Policy